ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పులివెందులలోని సీఎస్ఐ చర్చిలో క్రిస్మస్ ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. అలాగే సీఎం సతీమణి వైఎస్ భారతి, వైఎస్సార్ సీపీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ కూడా ఈ ప్రార్థనల్లో పాల్గొన్నారు. ప్రార్థనల అనంతరం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మాట్లాడుతూ…‘క్రిస్మస్ తో పాటు వైకుంఠ ఏకాదశి కలిసి రావడం శుభదినం. ఇవాళ 30లక్షలకు పైగా ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తున్నాం.