బ్లాక్‌లిస్ట్‌లో మల్లారెడ్డి కాలేజ్‌ ఆఫ్‌ ఇంజ నీరింగ్‌

తెలంగాణ రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి మల్లా రెడ్డికి చెందిన ‘మల్లారెడ్డి కాలేజ్‌ ఆఫ్‌ ఇంజ నీరింగ్‌–ఎంఆర్‌సీఈ(క్యాంపస్‌–1)’ను నేషనల్‌ అసెస్‌మెంట్‌ అండ్‌ అక్రెడిటేషన్‌ కౌన్సిల్‌ (న్యాక్‌) ఐదేళ్ల పాటు బ్లాక్‌ లిస్టులో పెట్టింది. దూలపల్లిలోని ఈ కళాశాలకు మెరుగైన గ్రేడ్‌ కోసం ఫోర్జరీ సంతకాలు, నకిలీ ధ్రువపత్రాలతో దరఖాస్తు చేసు కున్నట్లు న్యాక్‌ అడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీసర్‌ ఎం.అరుణ్‌.. మల్లారెడ్డి కాలేజీ ప్రిన్సిపాల్‌ కు లేఖ రాశారు. గతంలో ఎంఆర్‌సీ ఈకి న్యాక్‌ ‘బీ++’ గ్రేడ్‌ ఉండేది. మరింత మెరు గైన గ్రేడ్‌ కోసం రీఅసెస్‌మెంట్‌కు సెల్ఫ్‌ స్టడీ రిపోర్టును (ఎస్‌ఎస్‌ఆర్‌) మల్లారెడ్డి కాలేజీ గతేడాది న్యాక్‌కు పంపించింది.