స్టాఫ్‌ సెలె‌క్షన్‌ కమి‌షన్ (ఎస్సెస్సీ) ఉద్యో‌గా‌లకు ఉచిత శిక్షణ

స్టాఫ్‌ సెలె‌క్షన్‌ కమి‌షన్‌ (ఎ‌స్సెస్సీ) ఉద్యో‌గా‌లకు సిద్ధమయ్యే మైనార్టీ అభ్యర్థు‌లకు మైనార్టీ స్టడీ సర్కిల్‌ అండ్‌ కెరీర్‌ కౌన్సిలింగ్‌ సెంటర్‌ ఉచితంగా శిక్షణ ఇవ్వనుంది. కేంద్ర ప్రభుత్వంలోని వివిధ శాఖల ఉద్యోగాలను ఎస్సెస్సీ భర్తీ చేస్తుంది. ఆయా ఉద్యోగాలకు సన్నద్ధమయ్యే అభ్యర్థులకు మైనార్టీ స్టడీ సర్కిల్‌ ఉచితంగా శిక్షణ అందించనుంది. ఆసక్తి కలిగినవారు పేరు, పుట్టిన తేదీ, విద్యా‌ర్హత‌లతో కూడిన వివ‌రా‌లను [email protected], వాట్సాప్‌ నంబర్‌ 87900 77816లను పంపిం‌చా‌లని అధికారులు సూచిం‌చారు. ఇతర వివ‌రా‌లకు 040– 23236112 నంబ‌ర్‌లో సంప్రదించవచ్చని తెలి‌పారు. 

సీహెచ్‌ఎస్‌ఎల్‌ ద్వారా భర్తీ చేయనున్న లోయర్‌ డివి‌జన్‌ క్లర్క్‌ (ఎ‌ల్‌‌డీసీ)/జూని‌యర్‌ సెక్ర‌టే‌రి‌యట్‌ అసి‌స్టెంట్‌ (జే‌ఎ‌స్‌ఏ), పోస్టల్‌ అసి‌స్టెంట్‌ (పీఏ)/ సార్టింగ్‌ అసి‌స్టెంట్‌ (ఎ‌స్‌ఏ), డాటా ఎంట్రీ ఆప‌రే‌టర్‌ (డీ‌ఈవో) లెవల్‌– 4, 5, డాటా ఎంట్రీ ఆప‌రే‌టర్‌– గ్రేడ్‌ 1 లెవల్‌– 4 పోస్టులకు సంబంధించి శిక్షణ అందించనున్నారు.