తెలంగాణ రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి మల్లా రెడ్డికి చెందిన ‘మల్లారెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజ నీరింగ్–ఎంఆర్‌సీఈ(క్యాంపస్–1)’ను నేషనల్ అసెస్మెంట్ అండ్ అక్రెడిటేషన్ కౌన్సిల్ (న్యాక్) ఐదేళ్ల పాటు బ్లాక్ లిస్టులో పెట్టింది. దూలపల్లిలోని ఈ కళాశాలకు మెరుగైన గ్రేడ్ కోసం ఫోర్జరీ సంతకాలు, నకిలీ ధ్రువపత్రాలతో దరఖాస్తు చేసు కున్నట్లు న్యాక్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఎం.అరుణ్.. మల్లారెడ్డి కాలేజీ ప్రిన్సిపాల్ కు లేఖ రాశారు. గతంలో ఎంఆర్సీ ఈకి న్యాక్ ‘బీ++’ గ్రేడ్ ఉండేది. మరింత మెరు గైన గ్రేడ్ కోసం రీఅసెస్మెంట్కు సెల్ఫ్ స్టడీ రిపోర్టును (ఎస్ఎస్ఆర్) మల్లారెడ్డి కాలేజీ గతేడాది న్యాక్‌కు పంపించింది.