తెలంగాణ రాష్ట్ర తొలి మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌గా నియమితులైన వి.సునీతా లక్ష్మారెడ్డితోపాటు సభ్యులు గద్దల పద్మ, రేవతిరావు, సూదం లక్ష్మి, ఈశ్వరీబాయి, షాహీన్ అఫ్రోజ్, కొమ్ము ఉమాదేవి సోమవారం ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్‌ను మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ వారికి శుభాకాంక్షలు తెలిపారు.
తనపై నమ్మకంతో మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌గా బాధ్యతలు అప్పగించిన సీఎం కేసీఆర్‌కు సునీతా లక్ష్మారెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రంలో మహిళల సంక్షేమానికి, సమస్యల పరిష్కారానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని ఆమె పేర్కొన్నారు.