ఇస్రో చైర్మన్ కే శివన్‌ పదవీకాలం పొడిగింపు

ఇస్రో చైర్మన్‌ కే శివన్‌ మరో ఏడాదిపాటు పదవిలో కొనసాగనున్నారు. ఆయన పదవీకాలం వచ్చే జనవరి 14తో ముగియాల్సి ఉండగా కేంద్రం మరో ఏడాది పొడిగించింది. పదవీకాలం పొడిగింపునకు కేంద్ర నియామకాల కమిటీ బుధవారం ఆమోదం తెలిపింది. శివన్‌ ఈ పదవిలో 2022 జనవరి 14దాకా కొనసాగుతారు. 2018 జనవరి 14న ఆయన ఇస్రో చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టారు.