ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్ట్, హాస్యవిలన్ నర్సింగ్‌యాదవ్ (52) గురువారం రాత్రి కన్నుమూశారు. గత కొంత కాలంగా ఆయన మూత్రపిండాల సమస్య(క్రానిక్ కిడ్నీ డిసీజ్)తో బాధపడుతున్నారు. రెండు రోజుల క్రితం సోమాజిగూడలోని యశోద దవాఖానకు డయాలసిస్ కోసం వచ్చారు. ఈ క్రమంలో ఆయన పరిస్థితి విషమించింది. చికిత్స అందిస్తుండగా గురువారం రాత్రి మృతి చెందినట్టు దవాఖన వర్గాలు తెలిపాయి. నర్సింగ్‌యాదవ్‌కు భార్య చిత్ర, కుమారుడు రిత్విక్ ఉన్నారు. మృతదేహాన్ని కుటుంబసభ్యులు సుల్తాన్‌బజార్‌లోని ఆయన స్వగృహానికి తరలించారు.
