తెలంగాణలో ముగిసిన ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్‌

తెలంగాణలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్‌ ప్రశాంతంగా ముగిసింది. పోలింగ్‌ సమయం ముగియడంతో పోలింగ్ స్టేషన్ల వద్ద ఎన్నికల సిబ్బంది గేట్లు మూసివేశారు. కానీ, భారీ ఎత్తున ఓటు వేసేందుకు పట్టభద్రులు క్యూలైన్లలో బారులు తీరారు. అయితే క్యూలైన్లతో బారులు తీరిన ఓటర్లకు ఓటు వేసే అవకాశం ఉంటుందని ఎన్నికల అధికారులు తెలిపారు.