తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు బుధవారానికి వాయిదా పడ్డాయి. దివంగత ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య సహా మాజీ సభ్యుల మృతికి శాసనసభ సంతాపం తెలిపింది. అనంతరం సభను రేపటికి వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు. బుధవారం ఉదయం 10:30 గంటలకు సభ తిరిగి ప్రారంభం కానుంది. రేపు గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాల తీర్మానంపై చర్చ చేపట్టి సమాధానం ఇవ్వనున్నారు. మార్చి 18న బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు.