అంబేద్కర్‌ సూచించిన మార్గంలో నడుద్దాం: మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి

రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ 130వ జయంతి సందర్భంగా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి నివాళులర్పించారు. అరణ్య భవన్‌లో జరిగిన కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర పాడి పరిశ్రమ అభివృద్ధి సహకార సమాఖ్య చైర్మన్ లోకా భూమారెడ్డితో కలిసి అంబేద్కర్‌ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..
సమసమాజ స్థాపన కోసం, దేశాభివృద్ధి కోసం నిరంతరం పాటుపడిన మహనీయుడు డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ అని అన్నారు. ఆయన ఆశయాలకు అనుగుణంగా నడుచుకోవాలని, సూచించిన మార్గంలో పయనించి నవభారత నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలన్నారు.