ముస్లిం సోదరులకు ఏపీ సీఎం జగన్‌ శుభాకాంక్షలు

రంజాన్‌ నెల ప్రారంభం సందర్భంగా తెలుగు రాష్ట్రాలలోని ముస్లిం సోదరులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. రంజాన్‌ మాసం ముస్లింలకు ఎంతో పవిత్రమైనదని.. నెలరోజుల పాటు నియమనిష్టలతో కఠిన ఉపవాసవ్రతం ఆచరించే ఈ పుణ్యమాసాన్ని ముస్లిం సోదర సోదరీమణులంతా జరుపుకొంటారని పేర్కొన్నారు.