అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు మేకతోటి సుచరిత, తానేటి వనిత, విశ్వరూప్, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, ఎంపీ నందిగం సురేష్, ఎమ్మెల్యే మేరుగు నాగార్జున తదితరులు పాల్గొన్నారు. నవభారత వికాసానికి బాటలు వేసిన దార్శనికుడు అంబేద్కర్ అని సీఎం వైఎస్ జగన్ కొనియాడారు. ‘‘సర్వసమానత్వానికి కృషి చేసిన కారణజన్ముడు అంబేద్కర్. అత్యుత్తమమైన రాజ్యాంగాన్ని అందించిన మహోన్నతుడు. అంబేద్కర్ జయంతి సందర్భంగా నిండు మనసుతో నివాళి అర్పిస్తున్నానని’’ సీఎం పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయనకు ఘన నివాళులు అర్పించారు. దేశానికి అంబేద్కర్ చేసిన సేవలను కొనియాడారు.