భగత్‌తో పాటు అతడి కుటుంబ సభ్యులకు కోవిడ్‌

నాగార్జున సాగర్ లో కరోనా వైరస్ పంజా విసిరింది. ఉప ఎన్నిక ప్రచారం, పోలింగ్ రోజున మహమ్మారి వేగంగా విస్తరించింది. ఈ క్రమంలో టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్ధి నోముల భగత్ తో పాటు అతడి కుటుంబ సభ్యులకు కరోనా పాజిటివ్‌గా తేలింది.

వీరితో పాటు మరి కొందరు టీఆర్ఎస్ నాయకులు ఎంసీ కోటిరెడ్డి, కడారి అంజయ్యలకి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. అంతేకాక పలువురు కాంగ్రెస్, బీజేపీ నేతలు కూడా కోవిడ్‌ బారిన పడినట్లు తెలిసింది. నాగార్జునసాగర్ నియోజకవర్గంలో ఈ రోజు 160 కరోనా కేసులు నమోదయ్యాయి.