మంత్రి కొప్పుల ఈశ్వర్‌కు కరోనా పాజిటివ్‌

సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ కరోనా బారినపడ్డారు. కొవిడ్‌ పరీక్షల్లో పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. స్వల్ప లక్షణాలు ఉండడంతో కరోనా పరీక్షలు చేయించుకోగా.. పాజిటివ్‌గా తేలినట్లు ఆయన చెప్పారు. ప్రస్తుతం హోం ఐసోలేషన్‌లో ఉన్నట్లు పేర్కొన్నారు. గత కొద్ది రోజులుగా తనను కలిసిన వారంతా కొవిడ్‌ ప్రోటోకాల్స్‌ పాటించాలని, పరీక్షలు చేసుకొని జాగ్రత్తగా ఉండాలని మంత్రి కోరారు.