తెలంగాణలో కొత్తగా 4,826 కరోనా కేసులు.. 32 మంది మృతి

 తెలంగాణలో గడిచిన 24 గంటల వ్యవధిలో కొత్తగా 4,826 కొవిడ్‌ పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. వైరస్‌ బారినపడిన వారిలో 7,754 మంది కోలుకున్నారు. 32 మంది మృత్యువాతపడ్డారు. రాష్ట్రంలో మొత్తం పాజిటివ్‌ కేసులు 5,02,187కి చేరాయి. యాక్టివ్‌ కేసులు 62,797కు పెరిగాయి. ఇవాళ్టివరకు 2771 మంది ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రవ్యాప్తంగా ఇవాళ 65,923 శాంపిళ్లను పరీక్షించారు.