టీఎస్‌పీఎస్సీ చైర్మన్‌, సభ్యుల నియామకం

తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్ కమిషన్‌ చైర్మన్‌తోపాటు ఏడుగురు సభ్యులను బుధవారం సీఎం కేసీఆర్‌ నియమించారు. సీఎం కేసీఆర్ ప్రతిపాదనను గవర్నర్ తమిళిసై సౌందర రాజన్‌ వెంటనే ఆమోదించారు. టీఎస్‌పీఎస్సీ చైర్మన్‌గా బి. జనార్దన్‌ రెడ్డి (ఐఏఎస్‌) నియమితులయ్యారు. ప్రస్తుతం వ్యవసాయశాఖ ముఖ్యకార్యదర్శిగా ఆయన పని చేస్తున్నారు.

సభ్యులు వీరే..

కారం రవీందర్‌ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ ఆర్‌ సత్యనారాయణ, రిటైర్డ్‌ ఈ ఎన్సీ రమావత్‌ ధన్‌ సింగ్‌, సీబీఐటీ ప్రొఫెసర్‌ బీ లింగారెడ్డి, ఎస్డీసీ కోట్ల అరుణ కుమారి, ఆచార్య సుమిత్రా ఆనంద్‌ తనోబా, ఆయుర్వేద వైద్యులు అరవెల్లి చంద్ర శేఖర్‌ రావు సభ్యులుగా నియమితులయ్యారు.