ఏపీలో కొత్తగా 15,284 కరోనా పాజిటివ్‌ కేసులు

గత 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్‌లో 72,979 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 15,284 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయ్యింది. ఇప్పటివరకు రాష్ట్రంలో 16,06,210 మందికి కరోనా వైరస్‌ సోకింది. నిన్న ఒక్కరోజే కరోనా బారిన పడి 106 మంది మృత్యువాతపడ్డారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 10,328కు చేరింది. గడిచిన 24 గంటల్లో 20,917 మంది కోవిడ్‌ నుంచి కోలుకుని క్షేమంగా డిశ్చార్జ్‌ అవ్వగా, ఇప్పటివరకు 13 లక్షల 97 వేల 859 మంది డిశ్చార్జ్‌ అయ్యారు.