ఎంపీ నామా నాగేశ్వర రావు ఇల్లు, ఆఫీసుల్లో ఈడీ సోదాలు

టీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వర రావు ఇంట్లో, ఆఫీసుల్లో ఈడీ సోదాలు నిర్వహిస్తోంది. రూ.1064 కోట్ల బ్యాంక్ ఫ్రాడ్ కేసులో ముమ్మర సోదాలు నిర్వహిస్తోంది. నామా ఇంటితో పాటు ఆఫీసుల్లోనూ ఏకకాలంలో సోదాలు జరుగుతున్నాయి. మధుకాన్ కంపెనీ పేరుతో పలు బ్యాంకుల్లో భారీగా లోన్‌లు తీసుకొని పలు విదేశీ కంపెనీలకు డబ్బులు మళ్లించారని నామా నాగేశ్వర రావుపై అభియోగాలు వచ్చిన నేపథ్యంలో ఈడీ ఈ సోదాలు నిర్వహిస్తోంది.