తెలంగాణ‌లో కొత్త‌గా 869 క‌రోనా పాజిటివ్ కేసులు

తెలంగాణలో రోజురోజుకు క‌రోనా పాజిటివ్ కేసులు గ‌ణ‌నీయంగా త‌గ్గుతున్నాయి. గ‌త 24 గంట‌ల్లో కొత్త‌గా 869 పాజిటివ్ కేసులు మాత్ర‌మే న‌మోదు కాగా, 8 మంది మ‌ర‌ణించారు. ఇవాళ 1,197 మంది బాధితులు క‌రోనా నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. రాష్ర్టంలో మొత్తం 13,052 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. తెలంగాణ‌లో ఇవాళ 1,05,123 మందికి క‌రోనా ప‌రీక్ష‌లు నిర్వ‌హించారు. 97.32 శాతానికి రిక‌వ‌రీ రేటు పెరిగిన‌ట్లు వైద్యారోగ్య శాఖ అధికారులు వెల్ల‌డించారు.