ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో మెగా హరితహారం

ఖమ్మం జిల్లాలోని సత్తుపల్లి పట్టణంలోని జ్యోతి నిలయం పక్కన ఉన్న స్మృతి వనంలో మెగా హరితహారం నిర్వహించారు. సోమవారం ఒకేరోజు సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య ఆధ్వర్యంలో ప్రజాప్రతినిధులు, అధికారులు ఆరువేల మొక్కలు నాటారు. అనంతరం ఆయన నాటిన మొక్కకు ఏడాది కావడంతో కేక్‌ కట్‌ చేసి పుట్టిన రోజు జరిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. హరితహారం దేశానికే స్ఫూర్తిదాయకమన్నారు. తెలంగాణ రాష్ర్టాన్ని పూర్తి హరిత తెలంగాణగా మార్చడం సీఎం కేసీఆర్‌ లక్ష్యమని పేర్కొన్నారు.