గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ లో భాగంగా మొక్కలు నాటి బొంతు రామ్మోహన్

తన పుట్టినరోజును పురస్కరించుకొని గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా జీహెచ్‌ఎంసీ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ మొక్కలు నాటారు. తనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్‌ కుమార్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఎంపీ సంతోష్‌ కుమార్‌ చేపట్టిన గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ ఓ గొప్ప కార్యక్రమని ప్రశంసించారు. కార్యక్రమంలో చర్లపల్లి డివిజన్ కార్పొరేటర్ బొంతు శ్రీదేవి, స్వర్ణ రాజ్, తదితరులు పాల్గొన్నారు.