నీటి పారుద‌ల శాఖ‌పై ముఖ్య‌మంత్రి కేసీఆర్ స‌మీక్ష‌

ముఖ్య‌మంత్రి కేసీఆర్ నీటి పారుద‌ల శాఖ‌పై స‌మీక్ష నిర్వ‌హించారు. ప్ర‌గ‌తి భ‌వ‌న్‌లో జ‌రుగుతున్న ఈ స‌మావేశానికి సీఎస్ సోమేశ్ కుమార్, నీటి పారుద‌ల శాఖ ఉన్న‌తాధికారులు, ఇంజినీర్లు హాజ‌ర‌య్యారు. పాల‌మూరు – రంగారెడ్డి ఎత్తిపోత‌ల ప‌నుల పురోగ‌తితో పాటు ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం అక్ర‌మంగా నిర్మిస్తున్న ఇరిగేష‌న్ ప్రాజెక్టుల‌పై స‌మావేశంలో చ‌ర్చిస్తున్నారు.