హరితహారంలో అందరూ భాగస్వాములు కావాలి – శాసన మండలి ప్రొటెం చైర్మన్ భూపాల్ రెడ్డి

హరితహారంలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని శాసన మండలి ప్రొటెం చైర్మన్ భూపాల్ రెడ్డి అన్నారు. సంగారెడ్డి జిల్లాలోని తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని తెల్లాపూర్, వెలిమెల గ్రామాల్లో నిర్వహించిన హరితహారం, పట్టణ ప్రగతి కార్యక్రమాలకు భూపాల్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మున్సిపల్ చైర్పర్‌పర్సన్‌ లలితతో కలిసి మొక్కలు నాటారు. అనంతరం పట్టణ ప్రగతి పనులను ఆయన పరిశీలించారు.

ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న హరితహారంతో పచ్చదనం పెరుగుతుందన్నారు. ప్రతి ఒక్కరు మొక్కలు నాటేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. పల్లె,పట్టణ ప్రగతితో గ్రామాలు, పట్టణాలు అద్భుతంగా అభివృద్ధి సాధిస్తునాయన్ని తెలిపారు. కార్యక్రమంలో వైస్ చైర్మన్ రాములు గౌడ్, కౌన్సిలర్లు రవీందర్ రెడ్డి, సుచరిత, ఉమేశ్వర్, శ్రీశైలం, ఏఎంసీ వైస్ చైర్మన్ మల్లారెడ్డి, అధికారులు పాల్గొన్నారు.