చెట్లతోనే మానవ మనుగడ : అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి

చెట్లతోనే మానవ మనుగడ ఆ ధారపడి ఉందని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. కొండాపుర్ గ్రామ పంచాయతీ పరిధిలో మల్టీ లెవల్ అవెన్యూ ప్లాంటేషన్ భాగంగా జాతీయ రహదారిపై డివైడర్‌ మధ్యలో పంచాయతీరాజ్ శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియాతో కలిసి మంత్రి మొక్కలు నాటారు. అనంత‌రం గ‌త ఆదివారం హ‌రిత‌హారం కార్యక్రమంలో భాగంగా ఎంపీ సంతోష్ కుమార్ తో క‌లిసి ర‌హ‌దారికి ఇరువైపుల నాటిని మొక్కలను వారు ప‌రిశీలించారు.

ఈ సందర్భగా మంత్రి మాట్లాడుతూ..ప్రజలను భాగ‌స్వాముల‌ను చేస్తూ సీఎం కేసీఆర్‌ చేప‌ట్టిన‌ ప‌ల్లె, పట్టణ ప్రగతి, హ‌రిత‌హారం వంటి కార్యక్రమాలతో ప‌రిశుభ్రతతో పాటు పచ్చదనం పెరిగింద‌న్నారు. స్థానిక స్థానిక సంస్థలకు నిధులు మంజూరు చేయ‌డంతో గ్రామాలు, పట్టణాలు ఎంతో అభివృద్ధి చేందాయ‌ని తెలిపారు. ప‌రిశుభ్రతతోనే సీజ‌న‌ల్ వ్యాధులకు అడ్డుకట్ట వేయగలమని పేర్కొన్నారు. థ‌ర్డ్ వేవ్ ను నిరోధించేందుకు స‌హాక‌రించాల‌ని మంత్రి కోరారు.

గ‌తంతో పోలిస్తే గ్రామాల్లో మౌలిక వ‌స‌తులు చాలా మెరుగుప‌డ్డాయ‌ని పంచాయతీరాజ్ శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా అన్నారు. క‌లుషిత నీరు తాగ‌డం, పారిశుద్ధ్యం లోపించ‌డం తో సీజ‌న‌ల్ వ్యాధులు వ్యాపించేవ‌న్నారు. మిష‌న్ భ‌గీర‌థ ప‌థ‌కం ద్వారా ఇంటింటికి మంచినీరు ఇవ్వడంతో సీజ‌న‌ల్ వ్యాధులు తగ్గాయ‌ని తెలిపారు. కార్యక్రమంలో జ‌డ్పీ చైర్ పర్సన్‌ కే. విజ‌య‌ల‌క్ష్మి, కలెక్టర్‌ ముషార‌ఫ్ అలీ ఫారూఖీ, తదితరులు పాల్గొన్నారు.