రేపు వాసాల‌మ‌ర్రి వెళ్ల‌నున్న ముఖ్య‌మంత్రి కేసీఆర్

ఈ నెల 10వ తేదీన ముఖ్య‌మంత్రి కేసీఆర్ యాదాద్రి భువ‌న‌గిరి జిల్లాలోని వాసాల‌మ‌ర్రి గ్రామానికి వెళ్ల‌నున్నారు. ఇటీవ‌లే ద‌త్త‌త గ్రామం వాసాల‌మ‌ర్రిలో ప‌ర్య‌టించిన సీఎం.. త్వ‌ర‌లోనే మ‌ళ్లీ వ‌స్తాన‌ని ప్ర‌క‌టించిన విష‌యం విదిత‌మే. రేపు వాసాల‌మ‌ర్రిలో నిర్వ‌హించ‌బోయే గ్రామ స‌భ‌లో సీఎం కేసీఆర్ పాల్గొననున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్ల‌ను అధికారులు పూర్తి చేశారు. వాసాల‌మ‌ర్రి గ్రామాభివృద్ధికి ప్ర‌భుత్వం తోడ్పాటును అందిస్తుంద‌ని సీఎం ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. గ్రామ‌స్తులంతా క‌లిసిక‌ట్టుగా శ్ర‌మిస్తే అభివృద్ధి సాధ్య‌మ‌వుతుంద‌న్నారు.