రూ.10 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టబడ్డ నెక్కొండ మండల వ్యవసాయ అధికారి సంపత్ రెడ్డి

ఓ ఫర్టిలైజర్ వ్యాపారి నుంచి రూ. 10 వేల లంచం తీసుకుంటు నెక్కొండ మండల వ్యవసాయ అధికారి సంపత్ రెడ్డి రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డాడు. నెక్కొండ మండల కేంద్రంలోని వ్యవసాయ శాఖ కార్యాలయంలో మంగళవారం ఏసీబీ అధికారుల దాడులు నిర్వహించారు. వ్యవసాయ అధికారి సంపత్ రెడ్డిని అదుపులోకి తీసుకుని ఏసీబీ ఆధికారులు విచారిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.