ఏసీబీకి చిక్కిన వికారాబాద్‌ జిల్లా పెద్దేముల్‌ ఎస్‌ఐ చంద్రశేఖర్‌

వికారాబాద్‌ జిల్లాలోని పెద్దేముల్‌ ఎస్‌ఐ చంద్రశేఖర్‌ లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ అధికారులకు మంగళవారం చిక్కాడు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. మాంబాపూర్‌ గ్రామానికి చెందిన ఎంపీటీసీ శ్రీనివాస్‌ నుంచి ఇసుక అక్రమ రవాణా విషయంలో రూ.50వేలు లంచం డిమాండ్‌ చేశాడు. గత మూడు రోజుల కిందట ఎస్‌ఐకి శ్రీనివాస్‌ రూ.20వేల చెల్లించాడు. మంగళవారం మరో రూ.30వేలు తీసుకుంటుండగా.. ఏసీబీ అధికారులు దాడి చేసి పట్టుకున్నారు. ఈ సందర్భంగా ఎస్‌ఐ చంద్రశేఖర్‌ను అధికారులు అదుపులోకి తీసుకున్నారు.