గడిచిన 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా 2,526 కరోనా కేసులు నమోదయ్యాని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ తెలిపింది. కొత్తగా 2,933 మంది బాధితులు కోలుకున్నారు. మరో 24 మంది మహమ్మారి బారినపడి ప్రాణాలు కోల్పోయారు. తాజాగా నమోదైన కేసులతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 19,32,105కు పెరిగాయి. ఇందులో 18,93,498 మంది బాధితులు కోలుకున్నారు. మహమ్మారి బారినపడి 13,081 మంది ప్రాణాలు వదిలారు. ప్రస్తుతం రాష్ట్రంలో 25,526 యాక్టివ్ కేసులున్నాయని ఆరోగ్యశాఖ పేర్కొంది.