తెలంగాణ సాంస్కృతిక సార‌థి చైర్మ‌న్‌గా బాధ్య‌త‌లు స్వీక‌రించిన ఎమ్మెల్యే ర‌స‌మ‌యి బాల‌కిష‌న్

తెలంగాణ సాంస్కృతిక సార‌థి చైర్మ‌న్‌గా టీఆర్ఎస్ ఎమ్మెల్యే ర‌స‌మ‌యి బాల‌కిష‌న్ బాధ్య‌తలు స్వీక‌రించారు. మాదాపూర్ స్టేట్ ఆర్ట్ గ్యాల‌రీలో జ‌రిగిన ఈ కార్య‌క్ర‌మంలో మంత్రి శ్రీనివాస్ గౌడ్, మాజీ ఎంపీ వినోద్, ఎమ్మెల్సీ గోర‌టి వెంక‌న్నతో పాటు ప‌లువురు పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా ర‌స‌మ‌యి బాల‌కిష‌న్‌కు మంత్రి శ్రీనివాస్ గౌడ్, వినోద్‌, గోర‌టి వెంక‌న్న శుభాకాంక్ష‌లు తెలిపారు.