వచ్చే ఏడాది జులై 1 నుంచి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువులపై నిషేధం విధిస్తూ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువుల తయారీ, దిగుమతి, నిల్వ, పంపిణీ, అమ్మకం, వినియోగాన్ని నిషేధిస్తూ ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్ మెంట్ సవరణ రూల్స్–2021 కింద పర్యావరణ శాఖ ఓ నోటిఫికేషన్ విడుదల చేసింది. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ప్లేట్లు, కప్పులు, స్ట్రాలు, ట్రేలు తదితరాలపై ఈ నిషేధం విధిస్తున్నట్లు అందులో స్పష్టం చేసింది. అలాగే ప్లాస్టిక్ క్యారీ బ్యాగుల వాడకంపై కొత్త ఆంక్షలు తీసుకొచ్చింది. ప్లాస్టిక్ క్యారీ బ్యాగుల మందం 50 మైక్రాన్ల నుంచి 75 మైకాన్లకు ఈ ఏడాది సెప్టెంబర్ 30 నుంచి పెంచనున్నారు. తాజా నోటిఫికేషన్ మేరకు వచ్చే ఏడాది డిసెంబర్ 31 నుంచి 120 మైక్రాన్లకు దీన్ని పెంచనున్నారు.