టీటీడీ పాలక మండలి సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేసిన మన్నే జీవన్ రెడ్డి

టీటీడీ పాలక మండలి సభ్యుడిగా మహబూబ్‌నగర్ జిల్లా నవాబ్‌పేట మండలం గుర్కుంటకు చెందిన యువ పారిశ్రామికవేత్త మన్నే జీవన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. సోమవారం శ్రీవారి ఆలయంలో గరుడాళ్వార్ సన్నిధిలో జీవన్ రెడ్డి చేత టీటీడీ అదనపు ఈవో ఏవీ ధర్మారెడ్డి ప్రమాణ స్వీకారం చేయించారు.

ఈ సందర్భంగా జీవన్‌రెడ్డి మాట్లాడుతూ..టీటీడీ ధర్మ కర్తల పాలక మండలిలో చోటు కల్పించిన తెలంగాణ సీఎం కేసీఆర్, ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు.కలియుగ వైకుంఠమైన శ్రీ తిరుమల వేంకటేశ్వర స్వామీ సన్నిధిలో ఒక భక్తునిగా నాకు సేవ చేసే అదృష్టం కలిగినందుకు చాలా సంతోషింగా ఉందన్నారు. ఇది నా పూర్వజన్మ సుకృతంగానే భావిస్తానని ఆయన తెలిపారు.