గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ పిలుపు మేరకు తెలంగాణ రాష్ట్ర టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా జమ్మి మొక్కలు నాటారు. ఊరికో జమ్మి చెట్టు.. గుడిగుడికో జమ్మి చెట్టు.. కార్యక్రమంలో భాగంగా మంగళవారం వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయ ప్రాంగణంలో, ఆర్యవైశ్య సంఘం లంగర్‌హౌస్‌లో ఆరు 6 జమ్మి చెట్లు నాటారు.
అట్లాగే రాజేంద్రనగర్ గంధంగూడ, తుల్జా భవాని రేణుక ఎల్లమ్మ ఆలయం, పిరంచెరువు ఆలయంలో ఆరు జమ్మి చెట్లు నాటినట్లు ఉప్పల శ్రీనివాస్ తెలిపారు. ఈ కార్యక్రమం ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ హైదరాబాద్ జిల్లా ప్రెసిడెంట్ ఊట్కూరి శ్రీనివాస్ గుప్తా ఆధ్వర్యంలో జరిగింది. ఉప్పల శ్రీనివాస్ గుప్తా మాట్లాడుతూ.. ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా మరో వినూత్న కార్యక్రమం చేపట్టారని అన్నారు.