ఏపీలో పలువురు ఐఏఎస్‌ల బదిలీ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఐఏఎస్‌ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులిచ్చింది. జలవనరుల శాఖ కార్యదర్శి శ్యామలరావుకు పునరావాస కమిషనర్‌గా అదనపు బాధ్యతలు అప్పగించారు. వైద్యారోగ్య శాఖ ప్రత్యేక కార్యదర్శిగా నవీన్‌ కుమార్‌ను నియమించారు. ఈ మేరకు సీఎస్‌ డాక్టర్‌ సమీర్‌ శర్మ ఉత్తర్వులిచ్చారు.