హరిత నిధికి ముఖ‌రా(కె) గ్రామ పంచాయతీ విరాళం

ఆకుపచ్చని తెలంగాణే లక్ష్యంగా సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన హరిత నిధికి విశేష స్పందన లభిస్తున్నది. సీఎం కేసీఆర్‌ పిలుపుతో తెలంగాణలో చెట్లను పెంచేందుకు ప్రజాప్రతినిధులు, అధికారులు తమ వంతు ఆర్థిక సాయం అందజేస్తూ మంచి పనికి బాసటగా నిలుస్తున్నారు. ఇప్పుడు జిల్లాలోని ఇచ్చోడ మండలంలోని ముఖ్రా కె గ్రామపంచాయతీ కూడా అదే బాటలో నడుస్తూ ఆదర్శంగా నిలుస్తున్నది.

గ్రామపంచాయతీ ఆదాయం నుంచి నెలకు రూ. 2 వేల విరాళం ప్రకటిస్తూ గ్రామపంచాయతీ పాలకవర్గం గురువారం తీర్మానం చేసింది. వీటితో పాటు సర్పంచ్ వేతనం నుంచి నెలకు రూ.500 ఎంపీటీసీల వేతనాల నుంచి రూ. 500 హరిత నిధికి జమ చేయనున్న ప్రజా ప్రతినిధులు తెలిపారు.