‘వేములవాడ’ పనులు వేగవంతం చేయాలి: దేవాదాయ శాఖ మంత్రి కొండాసురేఖ

వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వరస్వామి దేవాలయం లో చేపడుతున్న అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని, మొదటి దశ పనుల ను వచ్చే ఏడాది మార్చి 31లోపు పూర్తిచేయాలని దేవాదాయ శాఖ మంత్రి కొండాసురేఖ అధికారులను, కాంట్రాక్టర్లను ఆదేశించారు. మొత్తం నాలుగు దశల్లో జరుగుతున్న ఈ పనుల్లో రూఫ్‌ లెవల్‌ పనులను ఈ ఏడాది వర్షాకాలం రాకముందే పూర్తిచేయాలని స్పష్టం చేశారు. ఆ దేవస్థానంలో కొనసాగుతున్న అభివృద్ధి పనుల పురోగతిపై మంగళవారం సచివాలయంలో ఆమె మంత్రి పొన్నం ప్రభాకర్‌తో కలిసి సమీక్షించారు. సమావేశంలో ప్రభుత్వ విప్‌, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్‌, దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి శైలజా రామయ్యర్‌, కమిషనర్‌ హరీశ్‌, కలెక్టర్‌ గరిమా అగర్వా ల్‌, ధార్మిక పరిషత్‌ సలహాదారు గోవిందహరి, ఈవో రమాదేవి పాల్గొన్నారు.