- నగరాన్ని, రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవడమే ప్రభుత్వ లక్ష్యం
- మే మొదటి వారం నుంచి సవరించిన భూముల మార్కెట్ విలువను అమలులోకి తీసుకురండి
- క్యాబినెట్ సబ్ కమిటీ సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
- Hilt పాలసీని ఆహ్వానిస్తున్నాము: ఇండస్ట్రియల్ ఎస్టేట్స్ ప్రతినిధులు
హైదరాబాదు నగరం తో పాటు, రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ప్రజా ప్రభుత్వం తీసుకొచ్చిన Hilt (హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్స్ ట్రాన్స్ఫర్మేషన్) తీసుకువచ్చిందని, ఈ పాలసీని ప్రజాస్వామ్య పద్ధతిలో అమలు చేయడమే ప్రభుత్వ లక్ష్యం అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు స్పష్టం చేశారు. శుక్రవారం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సచివాలయంలో రెవెన్యూ రిసోర్స్ మొబ లైజేషన్ క్యాబినెట్ సబ్ కమిటీ సమావేశం కమిటీ చైర్మన్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తో పాటు కమిటీ సభ్యులు, మంత్రులు ఉత్తంకుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, జూపల్లి కృష్ణారావులు పాల్గొన్నారు. Hilt పాలసీపై సమీక్ష సమావేశంలో ఇండస్ట్రియల్ ఎస్టేట్స్ ప్రతినిధులు సైతం పాల్గొని వారి అభిప్రాయాలు తెలిపారు. ఎయిర్ పొల్యూషన్ ఇండెక్స్ గణనీయంగా పెరిగిపోతున్న తరుణంలో కాలుష్యకారక పరిశ్రమలు అన్నిటిని ORR అవతలికి తరలించాలని కంపల్సరీ చేస్తే అందరూ వెళ్ళిపోతారని కొందరు ఇండస్ట్రియల్ ఎస్టేట్ల ప్రతినిధులు స్వయంగా చెప్పినప్పటికీ, మేం అందరి అభిప్రాయాలు పరిగణలోకి తీసుకొని ప్రజాస్వామ్య పద్దతిలో ముందుకు పోతున్నామని డిప్యూటీ సీఎం వివరించారు. UDL (అన్ డెవలప్డ్ ల్యాండ్) పాలసీ కింద భూములను అభివృద్ధి చేసే కార్యక్రమంలో కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, ఇండస్ట్రియల్ పార్కుల ప్రతినిధులు కలిసి అభివృద్ధి చేసుకునే ఆలోచన చేయాలి అన్నారు. ఔటర్ రింగ్ రోడ్డు, రీజినల్ రింగ్ రోడ్డు మధ్య ఇండస్ట్రియల్ పార్కులు ఏర్పాటు చేస్తే మంచిదని, చైనా తరహాలో ప్రత్యేకంగా పారిశ్రామిక పార్కులు ఏర్పాటు చేయాలని ఇండస్ట్రియల్ ఎస్టేట్ ప్రతినిధులు సూచించారు ఈ సూచనలను స్వాగతిస్తున్నాం, పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని డిప్యూటీ సీఎం స్పష్టం చేశారు. ఎవరిని ఇబ్బంది పెట్టాలన్న ఆలోచన తమకు లేదని నగరాన్ని, రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవడమే సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ఈ క్యాబినెట్ లక్ష్యం అన్నారు. ఓ.ఆర్.ఆర్ లోపల ఉన్న అన్ని ఇండస్ట్రియల్ అసోసియేషన్ తో కూర్చొని చర్చించి HILT పాలసీ అమలు ను వేగవంతం చేసుకుందాం అని డిప్యూటీ సీఎం సూచించారు. HILT పాలసీ గైడ్లైన్స్ రూపొందించే ముందు ఇండస్ట్రియల్ ఎస్టేట్ల ప్రతినిధుల ఆలోచనలకు చోటు కల్పించే ప్రయత్నం చేస్తామని డిప్యూటీ సీఎం తెలిపారు. రాష్ట్రంలో పరిశ్రమలు బాగా నడవాలి, కాలుష్యం ఉండకూడదు HILT పాలసీలో రాష్ట్ర ప్రభుత్వం చాలా ఓపెన్ గా ఉందని కమిటీ సభ్యుడు మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. కొత్త ఇండస్ట్రియల్ పాలసీలో కార్మికుల కోసం డార్మెటరీలు తప్పనిసరి చేశామని మంత్రి శ్రీధర్ బాబు వెల్లడించారు.
HILT పాలసీని ఆహ్వానిస్తున్నాం: శ్రీనివాసరెడ్డి
హిల్ట్ పాలసీని స్వాగతిస్తున్నామని చర్లపల్లి ఇండస్ట్రీస్ అసోసియేషన్ అధ్యక్షుడు డి శ్రీనివాస్ రెడ్డి సమావేశంలో తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ప్రస్తుత ప్రభుత్వం పాలసీని ఇస్టా రాజ్యాంగా అమలు చేసుకుంటూ పోతే మా BRS ప్రభుత్వం వచ్చాక ఇబ్బంది పడతారని కొంతమంది నాయకులు మమ్ములను పిలిచి చెప్పారు, అయితే ఇది ప్రభుత్వ నిర్ణయం, జీవో ప్రకారం అమలు జరుగుతుంది, ప్రస్తుతం మేము ఉంటున్న భూములను 30 సంవత్సరాల క్రితమే ఆనాటి ప్రభుత్వం నుంచి కొనుగోలు చేశాం, మా వద్ద sale deed లు సైతం ఉన్నాయని వివరించినట్టు శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. కన్వర్షన్ చార్జీలను రోడ్డు విస్తీర్ణాన్ని బట్టి 30% నుంచి 50% వరకు నిర్ణయించారు Hilt పాలసీ అమలులో ఎక్కడ క్యాష్ transfer లేదు కాబట్టి ఎవరికి ఎటువంటి అనుమానాలు అవసరం లేదని ఇండస్ట్రియల్ ఎస్టేట్ ప్రతినిధిగా మేము వారికి స్పష్టం చేశామని క్యాబినెట్ సబ్ కమిటీకి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఔటర్ రింగ్ రోడ్డు రీజినల్ రింగ్ రోడ్డు వద్ద ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు, UDL పాలసీ కింద భూములను అభివృద్ధి చేసి పారిశ్రామికవేత్తలకు సహకరించాలని శ్రీనివాస్ రెడ్డి కోరారు. ఔటర్ రింగ్ రోడ్డు బయట ఏర్పాటు చేసే ఇండస్ట్రియల్ పార్కుల్లో కనీస సౌకర్యాలు అయినా కార్మికులు, ఉద్యోగులకు వసతి సౌకర్యాలు కల్పించాలని కోరారు.
పాలసీ అమలకు ఆరు నెలలు సమయం ఇవ్వాలని, ప్రస్తుతం ఇండస్ట్రియల్ పార్కుల్లో పరిశ్రమలకు ఉన్న విద్యుత్తు, మంచినీరు వంటి వసతులను ఔటర్ రింగ్ రోడ్డు అవతల ఏర్పాటు చేసుకునే పరిశ్రమలకు షిఫ్ట్ చేసేందుకు ఎటువంటి అదనపు చార్జీలు వసూలు చేయరాదని శ్రీనివాస్ రెడ్డి కోరారు. హిల్ట్ పాలసీని స్వాగతిస్తున్నాము కన్వర్షన్ చార్జీలను స్వల్పంగా తగ్గించాలని ఉప్పల్ ఇండస్ట్రియల్ ఏరియా సర్వీస్ సెక్రెటరీ సత్యనారాయణ మంత్రులను కోరారు. హిల్ట్ పాలసీ ఎక్కువమంది పారిశ్రామికవేత్తలకు ఆమోదయోగ్యంగా ఉంది, సబ్సిడీలు ఇవ్వకపోయినా పర్వాలేదు భూమి చూపించి ఔటర్ రింగ్ రోడ్డు రీజినల్ రింగ్ రోడ్డు మధ్య ఇండస్ట్రియల్ ఏరియా ఏర్పాటు చేయాలని జీడిమెట్ల ఇండస్ట్రియల్ ఏరియా అధ్యక్షులు నరేంద్రబాబు మంత్రులకు సూచించారు. రాష్ట్రంలోని అన్ని శాఖల పరిధిలోని భూముల వివరాలు సేకరించాలని, వాటిలో ఖాళీగా ఉన్నవి, ఆక్రమణకు గురైనవి, శాఖల అందుబాటులో ఉన్న వాటి వివరాలు సేకరించాలని జిల్లా కేంద్రాల్లో కూడా ఈ సమాచారం సేకరించాలని మంత్రి జూపల్లి అధికారులను ఆదేశించారు. మే మొదటి వారం నుంచి సవరించిన భూముల మార్కెట్ విలువలను అమలు చేయాలని రిజిస్ట్రేషన్ శాఖ అధికారులను సబ్ కమిటీ ఆదేశించింది. రిసోర్స్ మొబలైజేషన్ లో భాగంగా తీసుకున్న నిర్ణయాలను అధికారులు స్పష్టంగా అమలు చేసి రాష్ట్ర ఆదాయాన్ని పెంచాలని, అశ్రద్ధ చేస్తే ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించబోమని డిప్యూటీ సీఎం స్పష్టం చేశారు. సమావేశంలో చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు, ఆర్థిక శాఖ ప్రధాన కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, ఉన్నతాధికారులు శశాంక, కృష్ణ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.
