- రూ.3.5 లక్షలు లంచం తీసుకుంటూ దొరికిన ఎఫ్‌డీఓ, డీఆర్‌ఓ
- లంచం తీసుకునేటప్పుడేమో.. లంచం తీసుకోవడం మా హక్కు అన్నట్టు ప్రవర్తిస్తారు..
- ACB అధికారులకు దొరికాక అమాయకపు మొఖాలు పెడతారు..
- లంచగొండి అధికారులను సర్వీస్ నుండే రిమూవ్ చేయాలని పలువురు మేధావులు డిమాండ్
రోడ్డు నిర్మాణ పనుల్లో చెట్ల నరికివేత వ్యవహారాన్ని సాకుగా చూపి, ఓ కాంట్రాక్టరు నుండి లంచం డిమాండ్ చేసిన భద్రాచలం అటవీ శాఖ ఉన్నతాధికారులు ఇద్దరు రెడ్ హ్యాండెడ్‌గా ఏసీబీకి చిక్కారు. చర్ల మండలం పూసగుప్ప ప్రాంతంలో కొత్తగా రోడ్డు వేస్తున్న సమయంలో అటవీ శాఖకు చెందిన పలు చెట్లను తొలగించాల్సి వచ్చింది. నిబంధనల ఉల్లంఘనను సాకుగా చూపి సదరు కాంట్రాక్టరుపై చర్యలు తీసుకోకుండా ఉండేందుకు భద్రాచలం ఫారెస్ట్ డివిజనల్ ఆఫీసర్(FDO) సుజాత, చర్ల ఇన్‌చార్జి(DRO) కృష్ణయ్య ఏకంగా రూ. 10 లక్షలు డిమాండ్ చేశారు. అంత భారీ మొత్తాన్ని ఇచ్చుకోలేక సదరు బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. వారి సూచన మేరకు గురువారం మొదటి విడతగా రూ.3.5 లక్షలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ డీఎస్పీ వై.రమేష్ బృందం మెరుపు దాడి చేసింది. డబ్బుతో సహా అధికారులను అదుపులోకి తీసుకున్నారు. లంచం తీసుకునేటప్పుడేమో.. లంచం తీసుకోవడం మా హక్కు అన్నట్టు ప్రవర్తిస్తారు.. ACB అధికారులకు దొరికాక అమాయకపు మొఖాలు పెడతారు.. ఈ భయం లంచం తీసుకునేటప్పుడే ఉంటే నలుగురిలో ఎలా పలుచన కారు కదా.. ప్రభుత్వం ఇస్తున్న లక్షల జీతాలు సరిపోవు అన్నట్టు.. అవతలి బెదిరిస్తూ.. భయపెడుతూ అడ్డగోలుగా ఏ మాత్రం భయం అనేది లేకుండా లంచాలు తీసుకుంటారు. ఇలాంటి లంచగొండి అధికారులను సర్వీస్ నుండే రిమూవ్ చేయాలని పలువురు మేధావులు డిమాండ్ చేస్తున్నారు.