రూ.25 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ విద్యుత్‌ ఏడీఈ

మెదక్‌ జిల్లా నర్సాపూర్‌ డివిజన్‌ అసిస్టెంట్‌ డివిజనల్‌ ఇంజినీర్‌ (ADE ఆపరేషన్స్‌ ) ముద్దం రమణా రెడ్డి లంచం తీసుకుంటూ ఏసీబీ(ACB) అధికారులకు పట్టుబడ్డారు. విద్యుత్‌ శాఖ డివిజన్‌ పరిధిలో చేపట్టిన కాంట్రాక్ట్‌ పనులకు సంబంధించిన రూ. 3 లక్షల 13,882 బిల్లుల మంజూరికి ఏడీఈ రూ.25 వేలు లంచంగా డిమాండ్‌ చేశారు. దీంతో సదరు కాంట్రాక్టర్‌ ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేయగా శుక్రవారం మధ్యాహ్నం కార్యాలయంలో రెడ్‌ హ్యండెడ్‌గా పట్టుబడ్డారు. ఏడీఈ వద్ద రూ. 25 వేలు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి, హైదరాబాద్‌ ఏసీబీ కోర్టులో ప్రవేశపెట్టామని ఏసీబీ అధికారులు వివరించారు.