తెలంగాణలో ప్రభుత్వ పాఠశాలలు, విద్యాభివృద్ధి కోసం ముందుకు వచ్చిన రహేజా గ్రూప్, రామ్ కీ ఫౌండేషన్, యశోద ఫౌండేషన్. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (CSR) కింద నిధులు అందజేస్తున్న రహేజా, రామ్ కీ, యశోదా సంస్థలు. సెక్రటేరియట్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో విద్యా శాఖతో రహేజా గ్రూప్, రామ్ కీ ఫౌండేషన్, యశోద ఫౌండేషన్ ఒప్పందం. సీఎం రేవంత్ రెడ్డి కి ఒప్పంద పత్రాలను అందజేసిన రహేజా గ్రూప్ అధ్యక్షుడు నీల్ సి. రహేజా, రామ్ కీ ఫౌండేషన్ మేనేజింగ్ ట్రస్టీ అల్లా దాక్షాయణి, యశోదా గ్రూప్ డైరెక్టర్ గోరుకంటి దేవేందర్ రావు.
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా జవహర్ నగర్ ప్రీ ప్రైమరీ నుంచి ఇంటర్ వరకు తరగతుల కొత్త ప్రాంగణానికి మొత్తం ఖర్చు లో 40% అంటే రూపాయలు 19.66 కోట్లు ఖర్చు చేయనున్న రాంకీ సంస్థ. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం తుక్కుగూడ ZPHS ఉన్నతీకరణ లో భాగంగా ప్రీ ప్రైమరీ నుంచి ఐదవ తరగతి, ఇంటర్ తరగతుల నిర్మాణం కోసం మొత్తం ఖర్చు లో 40% అంటే రూపాయలు 10.4 కోట్లు భరించనున్న రాంకీ సంస్థ. రంగారెడ్డి జిల్లా కొండాపూర్ లో ప్రీ ప్రైమరీ నుంచి ఇంటర్ వరకు తరగతుల కోసం అవసరమైన 50.50 కోట్ల లను భరించనున్న రహేజా గ్రూప్. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఉప్పల్ సుభాష్ నగర్ MPPS లో ప్రీ ప్రైమరీ, 6వ, 7వ తరగతుల కోసం అవసరమైన 12.20 కోట్ల ను భరించనున్న యశోదా హాస్పిటల్స్. కార్యక్రమంలో పాల్గొన్న విద్యా శాఖ కార్యదర్శి యోగితా రాణా, సాంకేతిక విద్యా శాఖ కమిషనర్ దేవసేన, సీఎం ప్రత్యేక కార్యదర్శి అజిత్ రెడ్డి,ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ (IGBC) ఛైర్మన్ సి శేఖర్ రెడ్డి.
