TIMS హాస్పిటల్ ప్రారంభానికి ముందస్తు ఏర్పాట్లను వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ పరిశీలన

TIMS – సనత్ నగర్ లోని హాస్పిటల్ ప్రారంభానికి ముందస్తు ఏర్పాట్లను రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ పరిశీలించారు. ఆస్పత్రిలోని అన్ని విభాగాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అంతర్జాతీయ స్థాయిలో ఏర్పాటు చేసిన టీమ్స్ ఆసుపత్రిలో ఆధునిక ఎక్విప్మెంట్, వైద్య సదుపాయాలు, ఇన్ఫ్రా, లాబరేటరీ, బ్లడ్ బ్యాంకు లను మంత్రి స్వయంగా పరిశీలించారు. ఆస్పత్రిలో చేపట్టిన సివిల్ వర్క్ లను శరవేగంగా పూర్తి చేయాలని మంత్రి దామోదర్ రాజనర్సింహ ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. ఆస్పత్రి ప్రాంగణం లో డాక్టర్లకు విడివిడిగా బాయ్స్, గర్ల్స్ ల హాస్టల్ బ్లాక్స్ లను ఏర్పాటు చేయాలని మంత్రి ఆదేశించారు. ఆస్పత్రికి వచ్చే ఔట్ పేషంట్, ఇన్ పేషంట్ ల అవసరమైన టాయిలెట్ బ్లాక్స్ లను ఏర్పాటు చేయాలి. ఆస్పత్రి ప్రాంగణంలో ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా మల్టీ లెవెల్ పార్కింగ్ సిస్టం ను అభివృద్ధి చేయాలి.

ఆసుపత్రికి వచ్చిన రోగుల సహాయకుల కోసం ధర్మశాల, ఆస్పత్రిలో రెండు క్యాంటీన్ (2) లను ఏర్పాటు చేయాలని మంత్రి ఆదేశించారు. ఆస్పత్రిలో పరిపాలన భవనం, టీబీ హాస్పిటల్ బోర్డు ఆఫీసు పనులను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. ఆస్పత్రి ప్రధాన ద్వారంలో పోలీస్ అవుట్ పోస్టును ఏర్పాటు చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. అంతర్జాతీయ స్థాయిలో నిర్మిస్తున్న ఆసుపత్రిలో డ్రైనేజీ, శానిటేషన్ నిర్వహణ, వాటర్ సప్లై ఇలాంటి సేవలు నిరంతరం కొనసాగేనా చర్యలు చేపట్టాలని మంత్రి ఆదేశించారు. ఆస్పత్రిలో అధునాతన ఇంటీరియర్, లాంజ్ లను ఏర్పాటు చేయాలన్నారు. ఆస్పత్రిలో విదేశీ రోగుల కోసం ఏర్పాటు చేసిన బ్లాక్స్ లో ఆధునిక సౌకర్యాలకు పెద్దపీట వేయాలని మంత్రి అధికారాలకు సూచించారు. ఆసుపత్రిలో ఏర్పాటు చేయనున్న అంతర్జాతీయ స్థాయి లేబరేటరీ ఏర్పాటుపై DME , HoD, తెలంగాణ వైద్య మాలిక సదుపాయాల కల్పన సంస్థ ఇంజనీరింగ్ అధికారులతో కమిటీని మంత్రి ఏర్పాటు చేశారు. టీమ్స్ ఆస్పత్రి పూర్తి స్థాయిలో ప్రారంభించేందుకు అవసరమైన కొనసాగింపు పనులు పూర్తి చేసేందుకు అంచనాలను రూపొందించాలని మంత్రి అధికారులను ఆదేశించారు.

TIMS ఆస్పత్రి క్షేత్రస్థాయిలో పరిశీలించిన అనంతరం, ప్రతిపాదిత పరిపాలన భవనంలో ఆస్పత్రి నిర్వహణ, మెరుగైన వైద్య సేవల కల్పన, సివిల్ వర్క్స్ లను శరవేగంగా పూర్తి చేయడంపై సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ లక్ష్యాలు, ఆస్పత్రి నిర్వహణ, మెరుగైన వైద్య సేవల కల్పన పై రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ అధికారులకు మంత్రి దిశా నిర్దేశనం చేశారు. టీమ్స్ ఆస్పత్రి పర్యటనలో రాష్ట్ర వైద్య ఆరోగ్య ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి డా. క్రిస్టినా జెడ్ చొంగ్తు, రాష్ట్ర మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ డా. నరేంద్ర కుమార్, తెలంగాణ వైద్య, మౌలిక సదుపాయాల కల్పన సంస్థ ఎండి హనుమంతు, నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ బీరప్ప, ఆర్ అండ్ బి శాఖ ఇంజనీరింగ్ అధికారులు రాజేశ్వర్ రెడ్డి, రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు పాల్గొన్నారు.