పర్యావరణ పరిరక్షణ ప్రతి పౌరుడి బాధ్యత: టీజీపీసీబీ మెంబర్ సెక్రెటరీ జి. రవి

ప్రపంచ పర్యావరణ దినోత్సవం – 2026 సందర్భంగా తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి (TGPCB) హైదరాబాద్ లో పర్యావరణ పరిరక్షణపై వివిధ అవగాహన కార్యక్రమాలను నిర్వహించింది. అందులో భాగంగా “ప్రకృతి స్ఫూర్తితో వాతావరణ పరిరక్షణ కోసం మన భవిష్యత్తు కోసం.” పర్యావరణ అవగాహన పోటీలలో విద్యార్థులు తమ ప్రతిభను ప్రదర్శిOచారు. ఈ సంవత్సరపు ప్రపంచ పర్యావరణ దినోత్సవ థీమ్ “Beat Plastic Pollution” (ప్లాస్టిక్ కాలుష్యాన్ని అంతం చేద్దాం) గా నిర్వహించబడుతోంది. ఈ కార్యక్రమాలలో భాగంగా విద్యార్థులు కళాకారులతో కలిసి చిత్రలేఖన పోటీలు, పర్యావరణ అంశాలపై స్కిట్ ప్రదర్శనలు, సాంస్కృతిక నృత్య కార్యక్రమాలు నిర్వహించారు. 150 మందికి పైగా విద్యార్థులు చిత్రలేఖన పోటీలలో 50 మంది విద్యార్థులు గానంలో పాల్గొన్నారు, 100 (5 గ్రూపులు) విద్యార్థులతో స్కిట్‌లో పాల్గొన్నారు.100(5 గ్రూపులు) విద్యార్థులు నృత్యOలో పాల్గొన్నారు. ప్లాస్టిక్ కాలుష్యం వల్ల కలిగే దుష్ప్రభావాలు, పర్యావరణ పరిరక్షణ, ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించాల్సిన అవసరంపై ప్రజలకు అవగాహన కల్పించారు. విద్యార్థులు తమ సృజనాత్మక చిత్రాలు, నాటికలు, నృత్య ప్రదర్శనల ద్వారా పర్యావరణ పరిరక్షణ సందేశాలను సమర్థవంతంగా ప్రజలకు చేరవేశారు. యువతలో పర్యావరణ బాధ్యతను పెంపొందించేందుకు ఇటువంటి కార్యక్రమాలు ఎంతో ఉపయోగకరమని TGPCB అధికారులు తెలిపారు.

“పర్యావరణ పరిరక్షణ ప్రతి పౌరుడి బాధ్యత అని పచ్చని, పరిశుభ్రమైన భవిష్యత్తును నిర్మించడంలో పిల్లలు కీలక పాత్ర పోషిస్తారని టీజీపీసీబీ మెంబర్ సెక్రెటరీ జి. రవి పేర్కొన్నారు. ఈ కార్యక్రమాల ద్వారా, పర్యావరణ పరిరక్షణలో చురుకుగా పాల్గొనేలా యువతను ప్రేరేపించడమే టీజీపీసీబీ లక్ష్యం. ఇలాంటి పోటీలు చిన్న వయస్సు నుంచే పిల్లలలో పర్యావరణ బాధ్యతను పెంపొందించడానికి సహాయపడతాయని అన్నారు. కళ ద్వారా సృజనాత్మకతను ప్రోత్సహించడం ద్వారా పర్యావరణ పరిరక్షణ, సుస్థిర జీవన విధానాలపై అవగాహనను సమర్థవంతంగా వ్యాప్తి చేయవచ్చని నొక్కి చెప్పారు.”
ఈ కార్యక్రమం పాల్గొన్నవారికి, విజేతలకు సర్టిఫికెట్లు, బహుమతులు అందచేసారు. సీనియర్ సాంఘిక శాస్త్రవేత్త డా. డబ్ల్యూ. జి. ప్రసన్న కుమార్, ప్రాజెక్ట్ ఆఫీసర్ టి.రాధిక, కోఆర్డినేటర్లు సౌమ్య, పూర్వి, రాజేష్ టీజీపీసీబీ అధికారులు, సిబ్బంది, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. పరిశుభ్రమైన మరియు హరిత తెలంగాణ నిర్మాణంలో ప్రతి పౌరుడు భాగస్వామి కావాలని TGPCB పిలుపునిచ్చింది.