తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల సందర్భంగా తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి (TGPCB)లో బోనాల పండుగను ఘనంగా నిర్వహించారు. తెలంగాణ స్వరాష్ట్రంగా ఏర్పాటైన సందర్భంగా 12 ఏండ్ల నుంచి జూన్ 2న PCB ప్రధాన కార్యాలయంలో అమ్మవారికి బోనాలు సమర్పించడం ఆనవాయితీగా వస్తుంది. అదేవిధంగా ఈ ఏడాది కూడా PCB ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల సందర్భంగా అమ్మవారి బోనాల జాతర ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుపుకున్నారు. అమ్మవారి ఆలయాన్ని వివిధ రకాల పూలతో సుందరంగా ముస్తాబు చేసారు. ఈ బోనాల సందర్బంగా పెద్ద సంఖ్యలో మహిళా ఉద్యోగులు అమ్మవారికి బోనాలు సమర్పించారు. అంతకు ముందు పీసీబీ మెంబర్ సెక్రెటరీ రవి నాయక్ జెండా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమములో CEE రఘు, SEE ప్రవీణ్ కుమార్, సీనియర్ సోషల్ సైంటిస్ట్ ప్రసన్న కుమార్, EE రామప్ప సిద్ది, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
