సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన జాతీయ ఎస్సీ కమిషన్ చైర్‌పర్సన్ కిషోర్ మక్వానా

సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన జాతీయ ఎస్సీ కమిషన్ చైర్‌పర్సన్ కిషోర్ మక్వానా. షెడ్యూల్డ్ కులాల సంక్షేమం, సామాజిక న్యాయం, సాధికారతకు సంబంధించిన పలు కీలక అంశాలపై ఆయనతో నిర్మాణాత్మకంగా చర్చించాను.రాష్ట్రంలో షెడ్యూల్డ్ కులాల సమగ్ర అభివృద్ధి, విద్య, ఉపాధి అవకాశాల విస్తరణతో పాటు వారి సంక్షేమం కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరించారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ఎస్సీ వర్గీకరణ అమలు, రాజ్యాంగబద్ధ హక్కుల పరిరక్షణ, సామాజిక న్యాయ సాధన దిశగా తీసుకుంటున్న చర్యలను కూడా వివరించారు.