ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తుదారులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌న్యూస్

ఎల్‌ఆర్‌ఎస్ (LRS) దరఖాస్తుదారులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌న్యూస్ తెలిపింది. ఎల్‌ఆర్‌ఎస్ ఫీజులు, ఛార్జీలపై 25శాతం రాయితీ కొనసాగిస్తున్నట్లు ప్రకటించింది. ఆగస్టు 1వ తేదీ నుంచి నవంబర్ 30, 2026 వరకు రాయితీ వర్తింపజేస్తున్నట్లు స్పష్టం చేసింది. 25శాతం రిబేట్‌కు గ్రీన్‌సిగ్నల్ ఇస్తూ జీఓ ఎంఎస్ నంబర్ -.213 జారీ చేసింది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్ రంజన్ ఉత్తర్వులు జారీ చేశారు. ఎల్‌ఆర్‌ఎస్ బకాయిల చెల్లింపునకు మరో నాలుగు నెలల గడువును పొడిగిస్తున్నట్లు స్పష్టం చేసింది. సంబంధిత శాఖలు తక్షణమే అమలు చర్యలు చేపట్టాలని తెలంగాణ ప్రభుత్వం ఆదేశించింది.