శాసనసభ ఆవరణలోని శ్రీ బంగారు మైసమ్మ దేవాలయంలో ఘనంగా ఆశాడ మాసం బోనాల పండుగ. లెజిస్లేటివ్ సెక్రటేరియట్ ఉద్యోగుల ఆద్వర్యంలో నిర్వహించిన ఈ బోనాల ఉత్సవాలలో పాల్గొన్న శాసనమండలి చైర్మన్ శ్రీ గుత్తా సుఖేందర్ రెడ్డి గారు, శాసన సభాపతి శ్రీ గడ్డం ప్రసాద్ కుమార్ గారు, శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాష్ గారు, శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు మరియు కౌన్సిల్ సెక్రటరీ డాక్టర్ వి. నరసింహా చార్యులు, అసెంబ్లీ సెక్రటరీ రేండ్ల తిరుపతి, లెజిస్లేటివ్ అధికారులు, సిబ్బంది. ముందుగా లెజిస్లేటివ్ ఉద్యోగులు సంప్రదాయబద్ధంగా బోనాలను సమర్పించగా, పోతరాజుల విన్యాసాలు, డప్పుల వాయిద్యాలు, వివిధ వేషధారణలతో కళాకారుల ప్రదర్శనలు ఉత్సవాలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. పెద్ద సంఖ్యలో ఉద్యోగులు, అధికారులు ఉత్సవాల్లో పాల్గొని భక్తిశ్రద్ధలతో అమ్మవారిని దర్శించుకున్నారు. శ్రీ బంగారు మైసమ్మ అమ్మవారి ఆలయంలో నిర్వహించిన పూజల్లో పాల్గొన్న ప్రముఖులకు ఆలయ పూజారులు తీర్ధప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా అందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ, అమ్మవారి ఆశీస్సులతో రాష్ట్రంలో ప్రజలందరూ సుభిక్షంగా, సుఖ శాంతులతో జీవించాలని, వర్షాలు సమృద్ధిగా కురిసి పంటలు బాగా పండాలని చైర్మన్ గారు, స్పీకర్ గారు ఆకాంక్షించారు.