హత్యాయత్నం కేసులో మంత్రి కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్‌

బోడుప్పల్‌ రియల్టర్‌ పై మంత్రి కొండా సురేఖ మాజీ ఓఎస్టీ సుమంత్‌ తదితరులపై నమోదైన హత్యాయత్నం కేసులో పోలీసులు ముగ్గురిని అరెస్టు చేశారు. గతనెల 30న హరికృష్ణను ఆర్థిక లావాదేవీల విషయమై జూబ్లీహిల్స్‌ రోడ్డు నంబరు-1 లోని తన కార్యాలయానికి పిలిపించిన సుమంత్‌.. ఇనుప రాడ్డుతో కొట్టి.. తర్వాత తన మనుషులతో కొట్టించాడు. దీంతో గాయపడిన హరికృష్ణ ఆస్పత్రిలో చికిత్స పొందిన తర్వాత ఈ నెల 20 జూబ్లీహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సుమంత్‌ కోసం 3 ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. తన పాత ఫోన్‌ను స్విచ్చాఫ్‌ చేసిన సుమంత్‌.. తనతోపాటు దాడిలో పాల్గొన్న తన అనుచరులు బత్తిని అరుణ్‌ కుమార్‌, ముత్యాల మహేందర్‌ రెడ్డి, పసుపులేటి కార్తీక్‌ కుమార్‌.. ప్రకాశం జిల్లా మార్టూరులో తల దాచుకున్నట్లు తేలడంతో అక్కడికి వెళ్లిన ప్రత్యేక పోలీసుల బృందం.. వారిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.