వన్యప్రాణులు మరియు పర్యావరణ కమిటీ ( Committee on Wild Life & Environment Protection) చైర్మన్ హోదాలో పాల్గొన్న అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, సభ్యులు కసిరెడ్డి నారాయణరెడ్డి, అనీల్ జాదవ్. సౌకర్యాల కమిటీ (Committee on Amenities) చైర్మన్ హోదాలో పాల్గొన్న శాసన సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్, సభ్యులు మేడిపల్లి సత్యం, యల్ రమణ, ప్రకాష్ గౌడ్, నెల్లికంటి సత్యం, బండారి లక్ష్మారెడ్డి, హాజరైన గ్రంథాలయ కమిటీ (Committee on Library) చైర్మన్ శ్రీమతి మట్టా రాగమయి గారు, సభ్యులు పల్వాయి హరీష్ బాబు, జుల్ఫీకర్ అలీ, దేశపతి శ్రీనివాస్, సిహెచ్ అంజిరెడ్డి, బొగ్గారపు దయానంద్, హాజరైన శాసన పరిషత్ కార్యదర్శి డా. వి నరసింహా చార్యులు, శాసనసభ కార్యదర్శి రేండ్ల తిరుపతి. ముందుగా నూతన కమిటీ చైర్మన్లకు, సభ్యులకు పుష్ప గుచ్ఛాలతో స్వాగతం పలికి శుభాకాంక్షలు తెలిపిన చైర్మన్, స్పీకర్ మరియు సెక్రటరీలు ఈ సందర్భంగా తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మాట్లాడుతూ సభలలో అన్ని అంశాలపై సుదీర్ఘంగా చర్చించే అవకాశం ఉండకపోవచ్చని, అలాంటి అంశాలను లోతుగా అధ్యయనం చేసి ప్రభుత్వానికి నిర్మాణాత్మకమైన సూచనలు చేయడంలో కమిటీలు కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు. ప్రజల సంక్షేమం, ప్రభుత్వ పథకాల సమర్థవంతమైన అమలు, ప్రజాధనం సద్వినియోగం వంటి అంశాలపై కమిటీలు ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. అంచనాల కమిటీ ప్రభుత్వ శాఖలకు కేటాయిస్తున్న నిధులు సక్రమంగా, లక్ష్యాలకు అనుగుణంగా వినియోగమవుతున్నాయా అనే అంశాన్ని పరిశీలిస్తూ ప్రభుత్వానికి అవసరమైన సూచనలు చేయాలని అన్నారు.
వన్యప్రాణి & పర్యావరణ పరిరక్షణ కమిటీ పర్యావరణ పరిరక్షణతో పాటు అడవులు, వన్యప్రాణుల సంరక్షణపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని గుత్తా సుఖేందర్ రెడ్డి సూచించారు. అభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ మధ్య సమతుల్యత పాటించాల్సిన అవసరం ఉందని, భావితరాలకు ఆరోగ్యకరమైన పర్యావరణాన్ని అందించడం మనందరి బాధ్యత అని పేర్కొన్నారు. అదేవిధంగా సౌకర్యాల కమిటీ ప్రజాప్రతినిధులకు అవసరమైన మౌలిక సదుపాయాలు, ఇతర అంశాలను ఎప్పటికప్పుడు పరిశీలించి మెరుగైన సౌకర్యాల కల్పనకు కృషి చేయాలని అన్నారు. గ్రంథాలయ కమిటీ శాసనసభ, శాసన మండలి సభ్యులకు అవసరమైన సమాచారాన్ని, చట్టాలు, నివేదికలు, పరిశోధన పత్రాలను సులభంగా అందుబాటులోకి తీసుకురావడంలో కీలక పాత్ర పోషించాలని సూచించారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని శాసనసభ గ్రంథాలయాన్ని మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు.
అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ప్రసంగం వన్యప్రాణులు మరియు పర్యావరణ కమిటీ కేవలం ప్రభుత్వ చర్యలను సమీక్షించే బాధ్యతకే పరిమితం కాకుండా తెలంగాణ రాష్ట్రంలో జీవనానికి ఆధారమైన అడవులు, వన్యప్రాణులు, జల వనరులు, గాలి మరియు పర్యావరణ సమతుల్యతను పరిరక్షించడంలో కీలకమైన బాధ్యతను కలిగి ఉన్నది. చైర్మన్ గా నా పదవీకాలంలో పర్యావరణం మరియు వన్యప్రాణుల పరిరక్షణకు సంబంధించి కమిటీ సభ్యులు నిర్మాణాత్మకమైన సూచనలు మరియు సహకారం అందించాలి. శాసనమండలి గ్రంధాలయం కేవలం పుస్తకాల సమాహారం మాత్రమే కాదు, అది మన శాసనమండలికి జ్ఞాన కేంద్రం మరియు సంస్థాగత చిహ్నం. సభలో చట్టాలు, బిల్లులపై చర్చల సమయంలో శాసనమండలి గ్రంధాలయం విలువైన సమాచారాన్ని అందిస్తుంది. గౌరవ సభ్యులందరూ తప్పకుండా శాసనమండలి గ్రంధాలయాన్ని ఉపయోగించుకోవాలి. తద్వారా గతంలో జరిగిన చర్చలు, రికార్డులను అధ్యయనం చేయడం ద్వారా సభ్యులు మరింత జ్ఞానంతో స్పష్టతతో, ఆత్మవిశ్వాసంతో మాట్లాడగలరు. సౌకర్యాల కమిటీ ప్రధానంగా సభ్యుల నివాస వసతులు, పరిశుభ్రత, నిర్వాహణ, ఆహార, క్యాటరింగ్, వైద్య సౌకర్యాలు, భద్రత వంట అంశాలపై దృష్టి సారిస్తుంది. ముఖ్యంగా మాజీ సభ్యుల సంక్షేమానికి తగిన ప్రాధాన్యత ఇవ్వాలి. వారు అందించిన విలువైన సేవల మరియు కృషిని గౌరవిస్తూ వారికి అవసరమైన సహాయ సహకారాలు అందించేలా మనం కృషి చేయాలి. ముఖ్యంగా వైద్యం, పెన్షన్ కు సంబంధించిన సౌకర్యాలు తక్షణమే పరిష్కరించాలి. కమిటీ సభ్యులు అందరికీ అనుకూలమైన, ఆధునికమైన అర్ధవంతమైన సిఫారసులను రూపొందించడంలో తమవంతు కృషి చేసి విలువైన సూచనలు, సలహాలను అందించాలి. అంచనాల కమిటీ ప్రజాధనం దుబారా కాకుండా ప్రతి శాఖ నుండి సమాచారాన్ని తెప్పించుకుని క్షుణ్ణంగా పరిశీలించి, చర్చించి తగు సూచనలు చేయాలి. కమిటీలు ప్రభుత్వ పనితీరును మరింత సమర్థవంతంగా తీర్చిదిద్దాలి.