తెలంగాణలో పర్యావరణం నాశనం అవుతుంటే చూస్తూ ఉండాలా..!

✳️ కొంత మంది PCB అధికారులు చేసే విచ్చలవిడి అవినీతి వల్ల, పరిశ్రమలు చేసే అడ్డగోలు కాలుష్యం వల్ల తెలంగాణలో భవిష్యత్ తరాలు నాశనం అవుతుంటే చూస్తూ ఊరుకోవాలా..!

✳️ కాలుష్య పరిశ్రమల వల్ల తెలంగాణలోని జిన్నారం, గడ్డపోతారం, దోతిగూడెం, అంతమ్మగూడెం, జడ్చర్ల సెజ్, సంగారెడ్డి, పటాన్ చెరువు, IDA బొల్లారం, ఖాజీపల్లి, పాశమైలారం, ఇస్నాపూర్, కిష్టాయిపల్లి, బొంతపల్లి, నందికంది,  దోమడుగు, మేడ్చల్, మల్కాజ్ గిరి (జీడిమెట్ల, జవహర్ నగర్), నాచారం లాంటి మొదలగు ప్రాంతాలలో దారుణమైన పరిస్థితి ఉన్న మాట వాస్తవం కాదా..?
✳️ హైదరాబాద్, రంగా రెడ్డి జిల్లాల్లోని కాటేదాన్, మహేశ్వరం ఏరియాలో ప్లాస్టిక్, టెక్స్ టైల్స్, లెదర్ పరిశ్రమల వ్యర్ధాలు మూసీ నదిని, చుట్టు ప్రక్కల ప్రాంతాల భూగర్భ జలాలను దారుణంగా దెబ్బతీసిన మాట నిజం కాదా..?
✳️ ప్రతిసారి వర్షం మాటున కాలుష్య పరిశ్రమలు రసాయన జలాలు విడుదల చేస్తున్న మాట నిజం కాదా..?
✳️ అత్యంత ఘోరమైన విషయం ఏంటంటే తెలంగాణలోని అనేక కాలుష్య పరిశ్రమలు రసాయన వ్యర్ధాల శుద్ధికయ్యే ఖర్చును తప్పించుకోవడానికి కొన్ని ఫార్మా, రసాయన పరిశ్రమలు దొంగచాటుగా రహస్య పైపులైన్ల ద్వారా కెమికల్స్ ను కాలువల్లోకి, చెరువుల్లోకి మరియు పరిశ్రమల లోపలే వందల అడుగుల లోతుకు “రివర్స్ బోరింగ్” ద్వారా ప్రమాదకరమైన రసాయనాలను భూమి పొరల్లోకి పంపి భూగర్భ జలాలను నాశనం చేస్తూ.. భవిష్యత్ తరాలకు కూడా పనికిరాకుండా చేస్తున్న మాట వాస్తవం కాదా..?
✳️ సుప్రీం కోర్టు, NGT (జాతీయ హరిత ట్రిబ్యునల్) కాలుష్య పరిశ్రమలపై కోట్ల రూపాయల జరిమానా విధించడమే కాకుండా, ఒక్క చుక్క రసాయన వ్యర్ధాలు కూడా బయటకు వదలకుండా “జీరో లిక్విడ్ డిశ్చార్జ్” విధానాన్ని 100% అమలు చేయాలని ఆదేశిస్తే.. అట్టి ఆదేశాలను కూడా తెలంగాణ PCB అధికారులు గాలికి వదిలేసిన మాట నిజం కాదా..?
✳️ తెలంగాణ రాష్ట్రంలో ప్రాణాంతకంగా పరిశ్రమల కాలుష్యం ఉందని కేంద్ర జలశక్తి శాఖ సర్వేలో షాకింగ్ నిజాలు బయటపడ్డ మాట వాస్తవం కాదా..? తెలంగాణ రాష్ట్రంలో చాలా జిల్లాల్లో నైట్రేట్ మోతాదు అనుమతించదగిన పరిమితులకంటే ఎక్కుగా ఉందని.. దేశంలోనే నైట్రేట్ కాలుష్యంలో తెలంగాణ టాప్ 3 స్థానంలో ఉందని నివేదికలు చెప్పిన దాంట్లో నిజం లేదా..?
✳️ ప్రతి పరిశ్రమ అవుట్లెట్ వద్ద ఆటోమేటెడ్ సెన్సార్లు పెట్టి ఆన్ లైన్ మానిటరింగ్ చేపట్టాలని ఒక్క చుక్క రసాయన నీరు బయటకు రాకుండా రీసైకిల్ చేసి పరిశ్రమలను నడుపుకోవాలనే ప్రజల డిమాండ్ లో PCB అధికారులకు న్యాయం కనిపించడం లేదా..? లేదంటే నిబంధనలు ఉల్లాఘించే పరిశ్రమల యాజమాన్యాలపై నాన్ బైలబుల్ కేసులు నమోదు చేయాలని, కాలుష్య ప్రభావిత గ్రామాల్లోని ప్రజలు కోరడంలో తప్పులేదని అనిపించడం లేదా..?
✳️ ఇటీవల తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి తీసుకున్న చర్యలలో భాగంగా నిబంధనలను ఉల్లంఘించిన 305 పరిశ్రమలను పూర్తిగా మూసివేయాలని ఆదేశించడంతో పాటు మరో 1,234 యూనిట్లకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఆయితే పలువురు పర్యావరణవేత్తలు మాత్రం ఈ చర్యలు ఏ మాత్రం సరిపోవని వాదిస్తున్న మాట నిజం కాదా..? కేవలం మూసివేత నోటీసులు ఇచ్చి వదిలేస్తే పలు పరిశ్రమలు కొన్ని రోజులు ఆగి మళ్ళీ దొంగచాటుగా వారి కార్యకలాపాలు సాగిస్తున్నాయని, అక్రమ పైప్ లైన్లను శాశ్వతంగా తొలగించి కొన్ని పరిశ్రమల యాజమాన్యాలపై క్రిమినల్ కేసులు పెడితేనే భయం ఉంటుందని డిమాండ్ చేయడంలో తప్పు ఏం ఉంది..?
✳️ పరిశ్రమలు రాత్రి వేళల్లో పొగ వదిలిన, వర్షం పడినప్పుడు రసాయన నీటిని బయటకు వదిలిన, ప్రజలు, కాలుష్య బాధితులు & పర్యావరణ వేత్తలు నేరుగా ఫిర్యాదు చేయడానికి PCB “జనవాణి కాలుష్య నివారిణి” యాప్ ను, అలాగే టోల్ ఫ్రీ నెంబర్ 10741 ని అందుబాటులోకి తెచ్చింది. కానీ ఇవి ఎంత బాగా పనిచేస్తున్నాయో సామాన్య ప్రజల కంటే PCB అధికారులకే బాగా తెలుసు..? 
✳️ క్లోజర్ ఆర్డర్ ఇవ్వాల్సిన పరిశ్రమలకు బ్యాంక్ గ్యారంటీ, డైరక్షన్స్ నోటీసులు మాత్రమే ఇస్తుందన్న పర్యావరణ వేత్తలు, కాలుష్య బాధితులు, మేధావుల మాటల్లో నిజం లేదా..? PCB ఉన్నతాధికారుల అంతరాత్మకు ఈ విషయం తెలియదా..?
✳️ జడలు విప్పుతున్న పారిశ్రామిక రసాయన కాలుష్యం తెలంగాణలో చాపకింద నీరులా విస్తరించుకుంటున్న మాట నిజం కాదా..? ఇది ఇలాగే కొనసాగితే భవిష్యత్ తరాలకు ప్రమాదం అనే విషయం తెలంగాణ PCB ఉన్నతాధికారులకు తెలియదా..?
✳️ తెలంగాణ రాష్ట్రంలో రసాయన మరణాలకు చావు మేళాలుగా మారిన కాలుష్య పరిశ్రమలను, తప్పుచేస్తున్నఆ కొంత మంది అవినీతి అధికారులను ఇలాగే వదిలేస్తే.. బంగారు తెలంగాణ, రైజింగ్ తెలంగాణ అనే తెలంగాణ ప్రభుత్వాల నినాదాలకు అర్ధం లేకుండా పోతుంది..
✳️ కాలుష్యం చేస్తున్న పరిశ్రమల మీద ఫిర్యాదు చేస్తే సరిపోను అధికారులు మరియు సిబ్బంది లేరు అని చెప్పడం తెలుసు కానీ.. ఈ విషయాన్ని ప్రభుత్వం, మన CM రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించాలనే కనీస ప్రయత్నం కూడా PCB ఉన్నతాధికారులు ఎందుకు చేయడం లేదు..? అలా చేస్తే తమ ఆధిపత్యానికి అడ్డుకట్ట పడుతుందని భయమా..?
✳️ తెలంగాణలో పర్యావరణం బాగుపడటం కొంత మంది PCB అధికారులకు ఇష్టం లేదా.. మా ఆధిపత్యమే కొనసాగాలనే ఆలోచనలోనే ఎంత కాలం ఉంటారు..? “మంది ఎక్కువైతే మజ్జిగా పలుచన అవుతాయి” అనే సామెతలాగా వీరి తీరు ఉంది.
✳️ రసాయన పరిశ్రమల వల్ల  కొన్ని ఊర్లకు ఊర్లే నాశనం అవుతుంటే ఆ రసాయన పరిశ్రమలు చేస్తున్న తప్పులకు PCB అధికారులు కారణం కాదని.. కాలుష్య పరిశ్రమల నుండి లంచాలు తీసుకోవడం లేదని ఆ కొంత మంది అవినీతి అధికారులు గుండె మీద చేయి వేసి చెప్పగలరా..?
✳️ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ (PCB)కాస్త.. పొల్యూషన్ క్రియేషన్ బోర్డ్ (PCB)గా మరియు పొల్యూషన్ కరప్షన్ బోర్డ్ (PCB)గా మారిందంటున్న కాలుష్య బాధితులు, పర్యావరణ వేత్తలు, మేధావుల మాటల్లో నిజం లేదా..?
✳️ తెలంగాణ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ((PCB) కాస్త.. పొల్యూషన్ క్రియేషన్ బోర్డ్ (PCB)గా మరియు పొల్యూషన్ కరప్షన్ బోర్డ్ (PCB)గా మారడంలో ఆ కొంత మంది అవినీతి అధికారుల పాత్ర కీలకం కాదని నిరూపించగలరా..? ఆ అవినీతి అధికారులు ACB విచారణకు సిద్ధమా..? ఈ కొంత మంది అవినీతి అధికారుల వలన మిగిలిన PCB అధికారులకు, PCBకి మరియు ప్రభుత్వానికి చెడ్డ పేరు రావడం లేదా..?
✳️ తప్పు చేస్తున్న PCB అధికారులపై ఫిర్యాదులు చేయకూడదా..? వాళ్ళు ఏమైనా పై నుండి దిగివచ్చారా.. అన్ని ప్రభుత్వ శాఖల్లో తప్పు చేస్తే చర్యలు తీసుకుంటారు.. PCBలో ఆధారాలతో సహా తప్పు చేసిన అధికారులపై ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకోకపోగా.. ఫిర్యాదు చేసిన వారిపైనే తప్పుడు ప్రచారం చేస్తూ.. ఎదురు దాడి చేయాలని చూస్తున్నారు అంటే ఏం అర్ధం చేసుకోవాలి..? PCBలో ఎవరు ఎంత పెద్ద తప్పు చేసిన అందరం కలిసి ఒకరిని ఒకరం కాపాడుకోవాలి.. తెలంగాణలో పర్యావరణమే కాదు.. భవిష్యత్ తరాలు నాశనం అయినా సరే ఏ మాత్రం పట్టించుకోకుండా.. మా తప్పులను మాత్రం ఎవరు ప్రశ్నించకుండా.. మేము మాత్రం బాగా లంచాలు తీసుకుని మేము.. మా కుటుంబాలు బాగుంటే చాలు అని అనుకుంటున్నారా..?
✳️ రసాయన పరిశ్రమలలో జరిగే  అగ్ని ప్రమాదాలకు PCB అధికారులకు సంబంధం లేదని గుండె మీద చేయి వేసుకుని చెప్పగలరా..?
✳️ రసాయన పరిశ్రమలలో జరిగే  అగ్ని ప్రమాదాలలో ఎంతో మంది ప్రాణాలు కోల్పోవడం వల్ల ఎన్నో కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి దానికి బాధ్యులు ఎవరు..?
✳️ రసాయన పరిశ్రమలలో LDAR (లీక్ డిటెక్షన్ అండ్ రిపేర్) స్టడీ రిపోర్ట్ లు ఎంత పక్కాగా అమలు చేస్తున్నారో ఓ నిజాయితీ అధికారి చేత విచారణ చేపిస్తే నిజా నిజాలు బయటకు వస్తాయి..
✳️ తెలంగాణ PCB ఉన్నది దేని కోసం కాలుష్యం చేస్తున్న పరిశ్రమలను కట్టడి చేయటానికా.. వాటి తప్పులకు కొమ్ముకాయడానికా..?
✳️ ఒకప్పుడు కాలుష్య పరిశ్రమలపై ఫిర్యాదులు చేస్తే టాస్క్ ఫోర్స్ మీటింగ్ లకు ఫిర్యాదుదారులను పిలిచి విచారణ చేసే వారు ఇప్పుడు ఎందుకు పిలవడం లేదు.. పరిశ్రమల వారిని మాత్రమే పిలవడం వెనుక ఉన్న ఉద్దేశం ఏంటి..? కాలుష్యం చేస్తున్న పరిశ్రమలపై చర్యలు తీసుకోకపోగా ఫిర్యాదుదారులను, కాలుష్య బాధితులను PCB ప్రధాన కార్యాలయం, జోనల్ మరియు RO కార్యాలయాల చుట్టూ తిప్పి తిప్పి విసిగిస్తున్నారన్న కాలుష్య బాధితులు, ఫిర్యాదుదారుల మాటల్లో నిజం లేదా..? దీనిపై ఉన్నతస్థాయి విచారణకు సిద్ధమా..?
✳️ PCBలో కొంత మంది అవినీతి అధికారులు ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారు అని పలువురు PCB అధికారులు, పర్యావరణ వేత్తలు చెప్తున్న దానిపై ACB లేదా ఎలాంటి విచారణకు అయిన సిద్ధమా..? తప్పు చేయనప్పుడు భయం ఎందుకు..?
✳️ ఆ కొంత మంది PCB అధికారులు వారు ఉద్యోగంలో చేరక ముందు వారి ఆస్తులు ఏంటి..? PCBలో ఉద్యోగంలో చేరిన తర్వాత వారి ఆస్తులు ఏంటి అనే దానిపై ఎలాంటి విచారణకు అయిన సిద్ధమా..? తప్పు జరగలేదు కదా భయం ఎందుకు..?
✳️ పరిశ్రమలు ఉండాలి తెలంగాణ అభివృద్ధి చెందాలి.. కానీ ఆ పరిశ్రమలు చేస్తున్న కాలుష్యాన్ని కట్టడి చేసి పరిశ్రమలను దారిలో పెట్టాల్సిన అధికారులే దారి తప్పితే ప్రశ్నించొద్దు అంటే ఎలా..? ప్రశ్నలకే భయపడితే.. భవిష్యత్ లో ఆధారాలతో సహా PCB లో  తప్పు చేస్తున్న ఆ కొంత మంది అవినీతి అధికారులపై ACB, HRC, NGT, కోర్టుల్లో కేసులు నమోదు చేస్తే ఎలా..?
✳️ PCB లో జరుగుతున్న తప్పులపై, అవినీతిపై ఇప్పటి వరకూ ప్రశ్నించకపోవడమే కాలుష్య బాధితులు, పర్యావరణ వేత్తలు, మేధావులు చేసిన తప్పా..?
✳️ జరుగుతున్న తప్పులపై విచారణ చేసుకొని తప్పులను సరిదిద్దుకోకపోగా కాలుష్య బాధితులు, పర్యావరణ వేత్తలు, మేధావులు అంటే చిన్న చూపు చూడటమే కాకుండా అడ్డగోలుగా మాటలు జారడం వెనుక అవినీతి చేసి అడ్డగోలుగా సంపాదించిన డబ్బే కారణమా..? మమ్మల్ని ఎవరు ఏం చేయలేరు అనే అహంకారం ఎందుకు..?
✳️ PCBలో సరిపోను సిబ్బంది ఉండరు.. వారిని పెంచుకోవాలనే ఆలోచన ఆ ఉన్నతాధికారులకు ఉండదు.. సంవత్సరాలు, సంవత్సరాలుగా ప్రమోషన్స్ ఆగిపోతాయి వాటిని పట్టించుకొని పరిష్కారం చూపించాలనే సోయి కూడా ఆ ఉన్నతాధికారులకు ఉండదు.. PCBలో AES లు చేయాల్సిన పనిని ఎవరెవరో చేస్తూ ఉంటారు అది వీరి కంటికి కూడా కనపడదు.. కొంత మంది RO అధికారులు వారికి సంబంధించిన వారి పేరు మీద వాహనాలను కొని వాడుతూ.. వేరే వారి ఉపాధిని దెబ్బకొడుతూ ఉంటారు.. అది కూడా ఈ ఉన్నతాధికారులకు కనపడదు.. PCBలో ఉన్న సమస్యలు వీరికి పట్టవు, కానీ వీరి మీద, వీరు చేసున్న తప్పులను ఎవరైనా ప్రశ్నిస్తే మాత్రం నోటికి వచ్చినట్లు మాటలు జారుతారు.. చేసిన తప్పులపై విచారణకు సిద్ధమా అంటే సమాధానం ఒక్కరి దగ్గర ఉండదు..
✳️ తెలంగాణలో 33 జిల్లాల్లో 33 కలెక్టరేట్స్ ఉండగా PCBలో 20 RO లు ఎందుకు ఉండకూడదు..? ఇంకో 3 ZO లు, 3 జోనల్ ల్యాబ్ లు ఎందుకు ఉండకూడదు.. ఈ దిశగా PCB అధికారులు ఎందుకు ఆలోచన చేయడం లేదు.. ఇలా చేస్తే ప్రభుత్వానికి మంచి పేరు వస్తదని, మరిన్ని ఉద్యోగాలు ఇవ్వాలని, కొత్త వారు ఉద్యోగంలోకి వస్తే ఆ కొంత మంది అవినీతి అధికారుల ఆదాయం తగ్గుతుందని భయమా..? అలాంటి ఉద్దేశమే లేకుంటే తెలంగాణలో పర్యావరణం పూర్తిగా నాశనం అవుతున్న, భూగర్భ జలాలు, గాలి కలుషితం అవుతున్న ఎందుకు ఆలోచన చేయడం లేదు..? ఎవరి స్వార్థ ప్రయోజనాల కోసం PCB సమస్యలను ప్రభుత్వం, CM రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లడం లేదు..
✳️ తెలంగాణ PCBలో ముగ్గురు (3) CEE లు, ఒక (1) CES, ఎక్కువ మంది Jcee లు, Jces లు ఉంటే తప్పేంటి..?
✳️ PCB కార్యాలయాల కోసం ప్రభుత్వం కేటాయించిన స్థలాలను సైతం PCB అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ కాపాడుకోవడం లేదని పలువురు PCB అధికారులే చెప్పడం విశేషం.
✳️ రసాయన పరిశ్రమల నుండి ఎన్ని ట్యాంకర్లు బహిరంగ ప్రదేశాలలో పోస్తూ కాలుష్యం చేస్తున్నా కూడా అట్టి పరిశ్రమలపై చర్యలు ఉండవు..
✳️ కాలుష్య పరిశ్రమల నుండి తెచ్చే శాంపిల్స్ PCB ల్యాబ్ లలో వ్యాల్యూస్ ఎందుకు తగ్గుతున్నాయి అనే ఆరోపణలపై సరైన సమాధానం ఎందుకు చెప్పడం లేదు..? దీని వెనుక పెద్ద ఎత్తున అవినీతి జరుగుతుందన్న ఆరోపణలు ఉన్నాయి దీనిపై ఉన్నతస్థాయి కమిటీ వేసి విచారణ చేపట్టే ధైర్యం ఉందా..?
✳️ ఇక్కడ ఎవ్వరం కూడా శాశ్వతంగా ఉండిపోవడానికి రాలేదు.. మనం బతికే కొద్దిరోజులు అయినా సమాజానికి ఏం చేశామనేది కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది.. మన స్వార్థం కోసం తెలంగాణలో పర్యావరణాన్ని పాడుచేసి భవిష్యత్ తరాలను ప్రమాదంలో పడేస్తున్నాం అనే సోయి కూడా లేకుండా ఇష్టారీతిన వ్యవహరించాలని చూస్తున్న ఆ కొంత మంది PCB అవినీతి అధికారులపై పోరాటం ఆపేది లేదు..
✳️ తెలంగాణ PCBలో అత్యంత విచ్చలవిడి అవినీతికి పాల్పడుతున్న ముగ్గురు (3) అవినీతి అధికారులపై పూర్తి ఆధారాలతో ACB కి ఫిర్యాదు చేయనున్న పర్యావరణ వేత్తలు.. 
✳️ అంతేకాకుండా వారి దగ్గర ఉన్న ఆధారాలతో హైకోర్టులో.. HRCలో.. ACB, విజిలెన్స్ లాంటి సంస్థలకు పూర్తి ఆధారాలను అందజేసి.. న్యాయ విచారణకు కోరుతాం అంటున్న పర్యావరణ వేత్తలు..
✳️ చిన్న చిన్న అవినీతి అధికారులను పట్టుకుంటున్న ACB అధికారులు PCBలో ఉన్న భారీ అవినీతి తిమింగలాలను ఎందుకు పట్టుకోవడం లేదో అర్థం కావడం లేదంటున్న పలువురు పారిశ్రామిక వేత్తలు, కాలుష్య బాధితులు, పర్యావరణ వేత్తలు..!
✳️ టాస్క్ ఫోర్స్, CFO, CFE, జోనల్ కార్యాలయాలు మరియు ల్యాబ్ లలో అవినీతి ఎలా జరుగుతుందో.. కన్సల్ టెంట్స్ మాటున జరుగుతున్న అవినీతి, ఫైలుకో రేటు.. పనికో బేరం..! పై PCBకి సంబంధించిన మరింత సమాచారం పూర్తి ఆధారాలతో త్వరలో..