- ఏసీబీకి చిక్కిన అబ్దుల్లాపూర్‌మెట్ మండల సర్వేయర్, తహసీల్దార్
ఏసీబీ వలలో రంగారెడ్డి జిల్లాకు చెందిన మరో ఇద్దరు రెవెన్యూ అధికారులు పట్టుబడ్డారు. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ మండలంలో రూ.20 లక్షలు లంచం తీసుకుంటూ తహసీల్దార్ సుదర్శన్‌రెడ్డి, సర్వేయర్ శ్రీనివాస్ పట్టుబడ్డ ఘటన సోమవారం సాయంత్రం చోటుచేసుకున్నది. హెచ్ఎండీఏ నిబంధనల ప్రకారం జాయింట్ ఇన్స్పెక్షన్ సర్వే నివేదిక జారీ చేసేందుకు సర్వేయర్ ఈ లంచం డిమాండ్ చేశారు. ఈ వ్యవహారంలో సర్వేయర్ ఇచ్చిన వాంగ్మూలం ప్రకారం తహసీల్దార్‌ను కూడా నిందితునిగా అరెస్ట్ చేశారు.