హైదరాబాద్లోని వరద బాధితులకు హెటిరో డ్రగ్స్ అండగా నిలిచింది. వరద సహాయక చర్యల కోసం భారీ విరాళం ప్రకటించింది హెటిరో డ్రగ్స్. తెలంగాణ ముఖ్యమంత్రి సహాయనిధికి రూ. 10 కోట్లు విరాళం అందించినట్లు హెటిరో డ్రగ్స్ చైర్మన్ పార్థసారథి రెడ్డి వెల్లడించారు. ఇప్పటికే ఆయా రాష్ట్రాలతో పాటు పలువురు పారిశ్రామికవేత్తలు, సినీ ప్రముఖులు సీఎంఆర్ఎఫ్కు భారీగా విరాళాలు అందించారు. తెలంగాణ ఉద్యోగ సంఘాల జేఏసీ ఒకరోజు మూలవేతనం సుమారు రూ.33 కోట్లు ముఖ్యమంత్రి సహాయ నిధికి అందజేసేందుకు ముందుకొచ్చింది.